జీవామృతం తయారీకి కావలిసిన పదార్థాలు
1) నీరు -20 లీటర్లు (ట్యాంకులో నిల్వ చేసిన నీటిలో జీవ శక్తి ఉండదు .బోరు లేదా బావి లేదా నది నుండి అప్పటికప్పుడు తెచ్చిన నీటిలో జీవశక్తి ఉంటుంది ).
2) దేశి ఆవు మూత్రం -5 లీటర్లు .
3) దేశి ఆవు పేడ -5 కిలోలు (వారం రోజుల లోపు సేకరించినది).
4) పాడి సున్నం -50 గ్గ్రాములు .
5) పాటి మట్టి లేదా పొలం గట్టు మన్ను -దోసెడు
జీవామృతం తయారీ విధానం
*) దేశి ఆవు పేడను ఒక పల్చటి గుడ్డతో మూటగా కట్టి .. 20 లీటర్లు నీరున్న తొట్టిలో 12 గంటలు వుంచాలి .
*) ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకోని అందులో 50 గ్రాముల సున్నం కలిపి .. ఒక రాత్రంతా ఉంచాలి .
*) రెండో రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేత్తో పిండి సారాన్ని నీటి తొట్టిలో కలపాలి .
*)పేడ నీళ్లున్నా తొట్టిలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కుడి వైపుకు కలపాలి .
*) 5 లీటర్ల దేశి ఆవు మూత్రాన్ని ,సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకు కుడి వైపుకి తిప్పాలి . అన్ని కలిపిన తర్వాత 12 గంటల పాటు ఉంచాలి .
ఈ జీవామృతాన్ని ఒక రాత్రి ఆలాగే ఉంచి మరునాడు ఉదయం నుంచి 48 గంటల లోపే వాడుకోవాలి .విత్తనాలకు బాగా పట్టించి వాటిని నీడలో ఆరబెట్టుకొని నాటటానికి సిద్ధం చేసుకోవాలి.
Jeevamrutham Preparation in Telugu
Reviewed by Praveen Gajula
on
July 16, 2019
Rating:
Useful content. Thank u very much.
ReplyDeleteThank you very much ..
ReplyDeleteIt really works well..